గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-03-18T06:42:53+05:30 IST

గ్రామాలను అన్ని రంగాల్లో అభి వృద్ధి చేసుకోవాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని గుంపుల, తిరుమలగిరి గ్రామపంచాయతీలలో

గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి
తిరుమలగిరి నర్సరీలో మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

 కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

చివ్వెంల, మార్చి 17: గ్రామాలను అన్ని రంగాల్లో అభి వృద్ధి చేసుకోవాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని గుంపుల, తిరుమలగిరి గ్రామపంచాయతీలలో కలెక్టర్‌ గురువారం ఆకస్మికంగా పర్యటించారు. గుంపుల గ్రామంలో ఉపాధిహామీ వర్క్‌సైట్‌ను సందర్శించారు. తదుపరి నర్సరీని సందర్శించి మొలకెత్తని బ్యాగులలో వెంటనే జీడి మామిడి విత్తనాలు నాటించాలన్నారు. అనంతరం తిరుమలగిరి గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటిక, రైతు వేదిక, ఉపాధిహామీ కింద చేపట్టిన సీసీ రోడ్డు పనులను కలెక్టర్‌ పరిశీలించారు. గ్రామపంచాయతీలో అసంపూర్తిగా ఉన్న ఎకరం ఖాళీ స్థలంలో అందరికీ ఉపయోగపడే సంత కానీ, మార్కెట్‌ యార్డు పనులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్‌ వెంట జడ్పీసీఈవో సురేష్‌, సర్పంచ్‌ కంచర్ల నిర్మలగోవిందరెడ్డి, ఎంపీవో టి.గోపి, ఏపీవో నాగయ్య, టీఏ దుర్గాభవానీ, పంచాయతీ కార్యదర్శులు కోటిరెడ్డి, వి.నరేష్‌, కె.అశోక్‌, గ్రామపంచాయతీ సిబ్బంది, వనసేవకులు, ఉపాధిహామీ కూలీలు ఉన్నారు. 

Read more