అందరి భాగస్వామ్యంతో వజ్రోత్సవాలు విజయవంతం :కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-19T06:12:53+05:30 IST

ప్రజలు, ప్రజాప్రతినిధుల, మహిళల భాగస్వామ్యంతో జిల్లాలో తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు విజయవంతమయ్యాయని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం కలెక్టరేట్‌లో జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బత్తిని యాదగిరిగౌడ్‌, మన్నె గోపాల్‌రెడ్డి, ఎడ్ల నారాయణరెడ్డి, బండ్రు నర్సింహ కుమారుడు ప్రభాకర్‌, రావుల సత్తయ్య కుమారు డు హరిబాబులను ఘనంగా సత్కరించారు.

అందరి భాగస్వామ్యంతో వజ్రోత్సవాలు విజయవంతం :కలెక్టర్‌

స్వాతంత్య్ర సమరయోధుడిని సన్మానిస్తున్న కలెక్టర్‌ సత్పథి, డీసీపీ

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 18: ప్రజలు, ప్రజాప్రతినిధుల, మహిళల భాగస్వామ్యంతో జిల్లాలో తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు విజయవంతమయ్యాయని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం కలెక్టరేట్‌లో జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బత్తిని యాదగిరిగౌడ్‌, మన్నె గోపాల్‌రెడ్డి, ఎడ్ల నారాయణరెడ్డి, బండ్రు నర్సింహ కుమారుడు ప్రభాకర్‌, రావుల సత్తయ్య కుమారు డు హరిబాబులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా వివిధ పాఠశాలల విద్యార్థిను లు ప్రదర్శించిన సాంస్కృతిక, కళారూపాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ప్రజల సహకారం తో ఈనెల 16నుంచి 18 తేదీ వరకు ఘనంగా నిర్వహించామన్నారు. 16న భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో నిర్వహించిన ర్యాలీలో అన్నివర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో డీపీసీ కె.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, కలెక్టరేట్‌ ఏవో ఎం నాగేశ్వరాచారి, డీపీఆర్‌వో పి.వెంకటేశ్వర్‌రావు, జిల్లా అధికారులు మధుసూదన్‌, నారాయణరెడ్డి, మంగ్తానాయక్‌, ధనుంజయ్య, యాదయ్య, శ్యాంసుందర్‌, ప్రజాసంఘాల ప్రతినిధులు బట్టు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read more