వైశ్య కార్పొరేషన ఏర్పాటు చేయాలి : లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2022-08-15T05:54:26+05:30 IST

ప్రభుత్వం వైశ్య కార్పొరేషనను ఏర్పాటు చేసి రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని ఆ ర్యవైశ్య సంఘం రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ డి మాండ్‌ చేశారు.

వైశ్య కార్పొరేషన ఏర్పాటు చేయాలి : లక్ష్మీనారాయణ
సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మీనారాయణ

చిట్యాల, ఆగస్టు 14: ప్రభుత్వం వైశ్య కార్పొరేషనను ఏర్పాటు చేసి రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని ఆ ర్యవైశ్య సంఘం రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ డి మాండ్‌ చేశారు. ఆదివారం చిట్యాలలో జరిగిన ఆర్యవైశ్య సంఘం, అనుబంధ సంఘాల జిల్లా నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మా ట్లాడారు. ఆర్యవైశ్యుల్లో కూడా పేదవారు ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించాలని, జిల్లాకో అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, మ హిళా విభాగం అధ్యక్షురాలు పందిరి గీత, నాయకులు తేరటుపల్లి హనుమంతు, వాసా విద్యాసాగర్‌, గంపా నాగేందర్‌, ఊరె లక్ష్మణ్‌, యామా దయాకర్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Read more