పేదల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ధ్యేయం: కూసుకుంట్ల

ABN , First Publish Date - 2022-09-11T05:58:28+05:30 IST

పేద ప్రజల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

పేదల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ధ్యేయం: కూసుకుంట్ల

చౌటుప్పల్‌/ సంస్థాన నారాయణపురం, సెప్టెంబరు 10: పేద ప్రజల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌ మునిసిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో శనివారం టీఆర్‌ఎస్‌ సమావేశం జరిగింది. ఈసందర్భంగా మాజీ సర్పంచ ఎర్ర భుజంగంతోపాటు టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి 100మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన బొడ్డు శ్రీనివా్‌సరెడ్డి, కౌన్సిలర్‌లు బొడిగె అరుణబాలకృష్ణ, వెంకటే్‌షయాదవ్‌ పాల్గొన్నారు. సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలోని గుండ్లమిట్ట కాలనీకి చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 


Read more