ఆర్టీసీలో యూనియన్లు అనుమతించాలి

ABN , First Publish Date - 2022-09-17T06:41:41+05:30 IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్లను అనుమతించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీలో యూనియన్లు అనుమతించాలి

నల్లగొండఅర్బన, సెప్టెంబరు 16: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్లను అనుమతించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం టీఎస్‌ ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎం కార్యాలయ ఎదుట జెండాను ఎ గురవేసి మాట్లాడారు. కార్మికుల హక్కులు, వారి సమస్యల పరిష్కారానికి మళ్లీ యూనియన్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత  ఆ ర్టీసీ కార్మికులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. నిరంకుశంగా వ్యవహరిస్తూ యూనియన్లను రద్దు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కార్యక్రమంలో యూనియన జిల్లా అధ్యక్షుడు కందుల నర్సింహ, బోడ స్వామి, శ్రీను, శ్యాం కుమార్‌, ఇక్బాల్‌, నర్సింహ, సత్యనారాయణ, సుందరయ్య పాల్గొన్నారు. 





Updated Date - 2022-09-17T06:41:41+05:30 IST