చెర్వుగట్టెక్కని ఆదాయం

ABN , First Publish Date - 2022-02-16T06:53:22+05:30 IST

నార్కట్‌పల్లి మండ లంలోని చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి దే వాలయ బ్రహ్మోత్సవాల ఆదాయం ఆశించిన స్థాయి లో సమకూరలేదు. బ్రహ్మోత్సవాల ప్రచారాని కి తగి న సమయం లేకపోవడంతో భక్తులు కూడా ఆశించి న స్థాయిలో రాలేదని ఆలయ నిర్వాహకులు అంచ నా వేశారు.

చెర్వుగట్టెక్కని ఆదాయం
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు(ఫైల్‌)

ఆర్టీసీకి కలిసొచ్చిన బ్రహ్మోత్సవం 

ఆశించిన స్థాయిలో సమకూరని ఆలయ ఆదాయం 

బ్రహ్మోత్సవాల ప్రచారానికితక్కువ సమయమే కారణం


నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 15: నార్కట్‌పల్లి మండ లంలోని చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి దే వాలయ బ్రహ్మోత్సవాల ఆదాయం ఆశించిన స్థాయి లో సమకూరలేదు. బ్రహ్మోత్సవాల ప్రచారాని కి తగి న సమయం లేకపోవడంతో భక్తులు కూడా ఆశించి న స్థాయిలో రాలేదని ఆలయ నిర్వాహకులు అంచ నా వేశారు. ఆరురోజుల పాటు ఉత్సవాలు నిర్వహిం చారు. కల్యాణం, అగ్నిగుండాల రోజు మాత్రమే అపరిమిత సంఖ్యలో భక్తులు వస్తారు. జాతర పేరిట దేవస్థానానికి ఆర్జిత సేవలు, ప్రసాద అమ్మకాలు, కల్యాణ, అగ్నిగుండాల కట్నాలు కలిపి రూ.35.26లక్ష ల మేర ఆదాయం సమకూరింది. వీటిలో ప్రసాద అమ్మకాలతో రూ.19.13లక్షలు,కల్యాణ కట్నాల ద్వారా రూ.10.19లక్షలు, అగ్నిగుండాల కట్నాల ద్వారా రూ.56,980లు, ఆర్జిత సేవల కింద రూ.5.36లక్షలు సమకూరాయి. అయితే ఈ పర్యాయం కల్యాణోత్సవానికి భక్తుల రాక తగ్గినా కల్యాణ కట్నాల ఆదాయం మాత్రం రూ.10,19,190 లు లభించి గతంలో కంటే రూ.2లక్షల ఆదాయం ఎక్కువగా సమకూర డం ఆశ్చర్యపర్చింది. గతేడాది జాతర ఆదాయం (రూ.39.97లక్షలు)తో పోలిస్తే మాత్రం ఈ పర్యా యం సుమారు రూ. 4.71లక్షల ఆదాయం తగ్గింది. గతేడాది ప్రసాదాల అమ్మకాల కింద రూ.28.50లక్ష లు సమకూరగా ఈ పర్యాయం కేవలం రూ.19.13లక్షలే ఉండడం ఇందుకు నిదర్శనం. ఒమిక్రాన్‌ కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల నేపథ్యంలో విధించిన ఆంక్షలతో అసలు ఈ పర్యాయం బ్రహ్మోత్సవాలు భక్తులను అనుమతించకుండా ఆంతరంగికంగానే నిర్వహిస్తారని మొదట ప్రచారం జరిగింది. కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో  చివరి నిమిషంలో బ్రహ్మోత్సవాలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. సమయం తక్కువ ఉన్నందున ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులు దిశానిర్ధేశం చేశారు. 


ప్రచారం లేక తగ్గిన భక్తుల హాజరు 

సమయం లేకపోవడంతో దేవస్థానం పూర్తిస్థాయి లో ప్రచార చేయలేకపోయింది. వాస్తవానికి ప్రతీ ఏటా రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట ప్రాంతాలకు నాలుగు ప్రచార రథాలను పంపి స్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్త్రత ప్రచారం కల్పించే వారు. వాల్‌పోస్టర్లు, భారీ స్వాగతతోరణాల ఏర్పాటు, వాల్‌పోస్టర్లను అంటించడం ద్వారా జరిగే  ప్రచారంతో భక్తులు భారీగా హాజరయ్యే పరిస్థితి ఉండేది. ఈ పర్యాయం పెద్దగా ప్రచారం లేకపోవడంతో సుమారు లక్ష మంది భక్తులు తక్కువగా వచ్చారని భావిస్తున్నారు. కల్యాణం రోజు రెండు లక్షలు, అగ్ని గుండాల రోజు 70వేల మంది భక్తులు, మిగతా నాలుగు రోజుల్లో కలిపి మరో 80 వేల మంది కలిపి మొత్తం 3.50లక్షల మంది చెర్వుగట్టును సందర్శించినట్లు అంచనా వేస్తున్నారు. 


ఆర్టీసీకి రూ.12లక్షల అదనపు ఆదాయం 

చెర్వుగట్టు జాతర ఆర్టీసీ నల్లగొండ రీజియన్‌కు కొంత అదనపు ఆదాయానికి కలిసొచ్చింది. జాతర సందర్భంగా చెర్వుగట్టు వరకు నార్కట్‌పల్లి, నల్లగొండ డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపింది. ప్రధానంగా 8వ తేదీ నుంచి 10వ తేదీ అగ్నిగుండాల ఉత్సవం నాటికి నల్లగొండ, నార్కట్‌పల్లి డిపోలకు రోజువారీ ఆదాయం కన్నా రూ.2లక్షల మేర అదనపు ఆదాయం సమకూరింది. రెండు డిపోలు కలిపి రోజువారీ షెడ్యూల్స్‌ లో భాగంగా 2.06లక్షల కిలోమీటర్లు తిరగాల్సి ఉండగా అదనగా 41,150 కిలో మీటర్లు కలిపి 2.46లక్షల కిలోమీటర్లు తిరిగాయి. ఒక్కో డిపోకు రోజుకు కనీసం రూ.2లక్షల మేర అదనపు ఆదాయం కింద సుమారు రూ.12లక్షల మేర అదనపు ఆదాయం లభించింది. 

Updated Date - 2022-02-16T06:53:22+05:30 IST