కరెంటు బిల్లు చెల్లించలేక ఇంటిని అమ్ముకునే పరిస్థితి

ABN , First Publish Date - 2022-09-24T05:57:52+05:30 IST

విద్యుత్‌ సంస్థలను కేంద్ర ప్రభు త్వం ప్రైవేట్‌పరం చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలో ఎరువుల గోదాం, ప్రహరీ నిర్మాణాలకు శం కుస్థాపన చేసి మాట్లాడారు.

కరెంటు బిల్లు చెల్లించలేక ఇంటిని అమ్ముకునే పరిస్థితి
చౌటుప్పల్‌లో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్‌కు అమ్ముకుంటున్నారు

విద్యుత్‌ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి 


చౌటుప్పల్‌ రూరల్‌, సెప్టెంబరు 23: విద్యుత్‌ సంస్థలను కేంద్ర ప్రభు త్వం ప్రైవేట్‌పరం చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలో ఎరువుల గోదాం, ప్రహరీ నిర్మాణాలకు శం కుస్థాపన చేసి మాట్లాడారు. డిస్కంలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించడంతో విద్యుత్‌రంగం దోపడీదారుల చేతిల్లోకి వెళుతోందని, దీంతో సా మాన్యులు కరెంటు బిల్లులు చెల్లించలేక ఇళ్లు అమ్ముకొనే పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికే డిస్కంలను ప్రైవేటుపరంచేస్తూ కేంద్రం సర్క్యులర్‌ జారీచేసిందన్నారు. విద్యుత్‌చట్టాలను తెస్తే ప్రజలు అడ్డుకుంటారని భావించి చట్టం తేకుండానే దొంగచాటుగా విద్యుత్‌ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని చెప్పారు. ప్రజల కష్టంతో నిర్మించుకున్న అనేక ప్రభత్వ సంస్థలను కార్పొరేటుశక్తులకు అమ్ముకున్నారని ఆరోపించారు. తమ దోస్తులను ప్రపం చ నెంబర్‌.1 చేయడానికే అన్నిరంగాలను ప్రైవేటుపరంచేస్తూ దేశసంపదను దోచిపెడుతున్నారని చెప్పారు. భారత్‌దేశంలోని భూమి మొత్తం ఇద్దరి చేతుల్లోకి వెళ్లనుందన్నారు. గుజరాత్‌లో మోటర్లకు మీటర్లు పెట్టి వ్యవసాయాని కి  ఆరు గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. గుజరాత్‌లో ఉచిత్‌ విద్యుత్‌ ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. మోదీది కసాయి ప్రభుత్వమన్నారు. మోదీ 10సార్లు రాష్ట్రానికి వచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌లాంటి నాయకుడు మాకు కావాలంటూ దేశంలోని ప్రజలం తా కోరుకుంటున్నారని చెప్పారు. మోదీ కుట్రలో భాగమే మునుగోడు ఉపఎన్నిక అని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ చింత ల దామోదర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, వైస్‌ చైర్మన్‌ అంజయ్యగౌడ్‌,సింగిల్‌విండో డైరెక్టర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.


కేసీఆర్‌ను దెబ్బతీసేందుకు మోదీ కుట్ర

మునుగోడు: రాష్ట్రంలో ఆదర్శ పాలనను సాగిస్తున్న సీఎం కేసీఆర్‌ చూసి ఓర్వలేక దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ, బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి జగదీ్‌షరెడ్డి ఆరోపించారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆఽధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో కొందరు స్వార్థపరులు బ్రిటీష్‌ పాలకులకు అమ్ముడుపోయినట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలకులకు కొందరు అమ్ముడు పోయారన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం అదే తరహాలో బీజేపీకీ మునుగోడు ప్రజల నమ్మకాన్ని తాకట్టుపెట్టాడన్నారు. ఈ దొంగ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, మోసాలు చేసే వారికి తగిన బుద్ధిచెబుతారన్నారు. త్యాగాలతో అవిర్భావించిన రాష్ట్రంలో బంగారు బాటలు వేయాలనే ల క్ష్యంతో సీఎం కేసీఆర్‌ ముందు కు సాగుతున్నారన్నారు. పలు సంక్షేమ పథకాలు అమలుచేస్తూ రాష్ట్రం లో తెలంగాణను నెంబర్‌ వన్‌గా నిలిపారన్నారు. కార్యక్రమంలో టీ ఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి తకెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగ య్య, గాదరి కిశోర్‌, పాల్గొన్నారు.

Read more