‘అరుణోదయ’ జిల్లా అధ్యక్షుడిగా ఉదయగిరి

ABN , First Publish Date - 2022-05-18T07:03:56+05:30 IST

అరుణోదయ సాంస్కృతి సమాఖ్య జిల్లా అధ్యక్షు డిగా ఉదయగిరిని ఎన్నుకున్నారు.

‘అరుణోదయ’ జిల్లా అధ్యక్షుడిగా ఉదయగిరి

కోదాడ, మే 17:  అరుణోదయ సాంస్కృతి సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా  ఉదయగిరిని ఎన్నుకున్నారు. మంగళవారం కోదాడలోని లాల్‌ బంగ్లాలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా ఎనిమిదో మహా సభలో తొమ్మిది మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు కస్తాల నాగన్న తెలిపారు.  జిల్లా అధ్యక్షుడిగా ఉదయగిరి, ఉపాధ్యక్షుడిగా వెంకన్న, ప్రధాన కార్యదర్శులుగా  సైదులు, యర్ర రమేష్‌, కోశాధికారిగా నగేష్‌, కార్యవర్గ సభ్యులుగా సంజీవ్‌, శ్రీను, నర్సిరెడ్డి, పవన్‌ను ఎన్నుకు న్నారు. ఈ సందర్భంగా కార్యవర్గంతో నాగన్న ప్రతిజ్ఞ చేయించారు. Read more