వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-12-12T23:40:24+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు, రామన్నపేట మండలాల్లో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ఆలేరు రూరల్‌/ రామన్నపేట, డిసెంబరు 12: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు, రామన్నపేట మండలాల్లో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఆలేరు ఎస్‌ఐ ఎండీ. ఇద్రీస్‌ అలీ తె లిపిన వివరాల ప్రకారం.. ఆలేరుకు చెందిన వల్లబోజు బ్రహ్మచారి(65) పని నిమిత్తం బైక్‌పై ఆలేరు నుంచి జనగామకు వెళ్లాడు. తిరిగి వస్తుం డగా కందిగతతండా వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బైక్‌ను ఢీ కొట్టి ంది. దీంతో తలకు తీవ్రగాయాలై బ్రహ్మచారి అక్కడికక్కడే మృతిచెం దాడు. బ్రహ్మచారి ఆలేరులోని శివాలయం వద్ద మెకానిక్‌గా పని చేస్తున్నా డు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. రామన్నపేట మండలంలోని బోగారం గ్రామానికి చెందిన తెల్సూరి శ్రీశైలం(35) బైక్‌పై భువనగిరి నుంచి బోగారం వస్తుండగా నిదాన్‌పల్లి క్రాస్‌రోడ్డు వద్ద లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. శ్రీశైలం భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-12-12T23:40:24+05:30 IST

Read more