రెండు బైకులు ఢీ: వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2022-08-15T06:35:40+05:30 IST

: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందగా, తల్లీకుమారుడు గాయపడ్డారు.

రెండు బైకులు ఢీ: వృద్ధుడి మృతి

మేళ్లచెర్వు, ఆగస్టు 14: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందగా, తల్లీకుమారుడు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని మేళ్లచెర్వు-రేవూరు గ్రామాల మధ్య ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఎస్‌ఐ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రేవూరుకు చెందిన షేక్‌ హుస్సేన్‌ అలీ(72) మేళ్లచెర్వుకు  తన ఎక్స్‌ఎల్‌ వాహనంపై వచ్చి, తిరిగి వెళుతుండగా ఎదురుగా  బైక్‌పై జానకిరాంరెడ్డి తల్లితో వస్తున్న వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో హుస్సేన్‌ అలీని, తల్లీ కుమారుడికి గాయాలయ్యాయి. హుస్సేన్‌ అలీని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లీ కుమారుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమా రుడు షేక్‌ షీలార్‌ మహ్మద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్‌ఐ  తెలిపారు. Read more