జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తుంగతుర్తి విద్యార్థి

ABN , First Publish Date - 2022-10-02T05:51:24+05:30 IST

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తుంగతుర్తి గురుకుల పాఠశాల విద్యార్థి ధరా వత్‌ సింధు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ దుర్గాభవానీ తెలిపారు.

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తుంగతుర్తి విద్యార్థి
ధరావత్‌ సింధు

తుంగతుర్తి, అక్టోబరు 1 : జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తుంగతుర్తి గురుకుల పాఠశాల విద్యార్థి ధరా వత్‌ సింధు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ దుర్గాభవానీ తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గుజరాత్‌లో జరిగే పోటీల్లో సింధు పాల్గొంటుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా సాఫ్ట్‌బాల్‌ అధ్యక్షుడు సురే్‌షరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 

Read more