TS News: మునుగోడులో కొనసాగుతున్న టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్

ABN , First Publish Date - 2022-08-16T01:46:36+05:30 IST

Nalgonda: మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) రాజీనామాతో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీలు తమ ఓటర్ల సంఖ్యను పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

TS News: మునుగోడులో కొనసాగుతున్న టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్

Nalgonda: మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) రాజీనామాతో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీలు తమ ఓటర్ల సంఖ్యను పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ (Operatioa Aakarsh) మొదలుపెట్టింది. రాజగోపాల్‌రెడ్డి దూకుడుకు టీఆర్‌ఎస్‌ బ్రేకులు వేసే పనిలో ఉంది. మండలాల వారీగా టీఆర్‌ఎస్‌ (TRS) ఎమ్మెల్యేలను ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. రాజగోపాల్‌రెడ్డి వెంట క్యాడర్‌ వెళ్లకుండా మంత్రి జగదీష్‌రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఆయన సమక్షంలోనే పలు మండలాల కాంగ్రెస్‌ పార్టీ నేతలు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ తరుపున అభ్యర్థిగా కాంట్రాక్టర్ చలమల్ల కృష్ణారెడ్డి పేరు తెరపైకి రావడంతో ఆ పార్టీని వీడేందుకు కొంతమంది ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు సిద్ధమైనట్లు సమాచారం. 

Updated Date - 2022-08-16T01:46:36+05:30 IST