ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుంటే టీఆర్‌ఎస్‌ నామినేషనను అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2022-10-05T06:08:28+05:30 IST

డిండి ఎత్తిపోతల భూ నిర్వాసిత రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించకుంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఉప ఎన్నికలో నామినేషన వేయకుండా అడ్డుకుంటామని రాష్ట్ర స్టూడెంట్‌ యూనియన అధ్యక్షుడు నల్లగొండ అంజి హెచ్చరించారు.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుంటే  టీఆర్‌ఎస్‌ నామినేషనను అడ్డుకుంటాం
భూ నిర్వాసితులకు దీక్షలో సంఘీభావం తెలుపుతున్న నల్లగొండ అంజి

మర్రిగూడ, అక్టోబరు 4: డిండి ఎత్తిపోతల భూ నిర్వాసిత రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించకుంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఉప ఎన్నికలో నామినేషన వేయకుండా అడ్డుకుంటామని రాష్ట్ర స్టూడెంట్‌ యూనియన అధ్యక్షుడు నల్లగొండ అంజి హెచ్చరించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌లో నిర్మాణంలో అజిలాపురం, రాంరెడ్డిప ల్లి, శివన్నగూడ, ఖుదాభక్ష్‌పల్లి భూములు కోల్పోయిన రైతులు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేస్తున్న దీక్ష 34వ రోజుకు చేరుకుంది. వారి దీక్షకు అంజి మద్దతు తెలిపి మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టప్రకారం భూములు కోల్పోయిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లిస్తానని ఇచ్చిన హామీని నెరరవేర్చాలని అన్నారు. చర్లగూడెం రిజర్వాయర్‌లో ఈ నాలుగు గ్రామాల రైతులకు చెందిన 2,115 ఎకరాల భూములు కోల్పోయారని, దీనివల్ల 80 మంది రైతులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులకు వెంటనే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీక్షా కార్యక్రమంలో బొడ్డుపల్లి జంగయ్య, కారింగు జంగయ్య, కొత్త లొంకయ్య, సుధాకర్‌రావు, తరంగి జీజా, యాదమ్మ, రాములమ్మ పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-05T06:08:28+05:30 IST