ట్రిపుల్‌ఆర్‌ సర్వే పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-08-31T06:09:19+05:30 IST

రీజినల్‌ రింగ్‌ రోడ్డు సర్వే పనులు నెల రోజుల్లో పూర్తిచేయాలని రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌ రాజు ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులను సమీక్షించా రు.

ట్రిపుల్‌ఆర్‌ సర్వే పనులు పూర్తి చేయాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ పమేలాసత్పథి

రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌ రాజు 

భువనగిరి రూరల్‌, ఆగస్టు 30: రీజినల్‌ రింగ్‌ రోడ్డు సర్వే పనులు నెల రోజుల్లో పూర్తిచేయాలని రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌ రాజు ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులను సమీక్షించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్‌ చుట్టు ఉన్న పట్టణ ప్రాంతాలను అనుసంధానం చేసే ఆర్‌ఆర్‌ఆర్‌కు భూ సేకరణ కోసం రెవె న్యూ, సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. రీజినల్‌ రిం గు రోడ్డు కోసం 100మీటర్ల వెడల్పులో హద్దులు నిర్ణయిస్తూ రాళ్లుపాతి స్వాధీనం చేసుకోవాలన్నారు. భూసేకరణ పారదర్శకంగా చేపట్టాలని సూ చించారు.జిల్లాలో తుర్కపల్లి,గుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌ మం డలాల్లో సర్వే పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పమేలాసత్పథి, అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, తహసీల్దార్లు కె.వెంకట్‌రెడ్డి, రామారావు పాల్గొన్నారు.

Read more