ట్రాక్టర్ల దొంగలు అరెస్టు

ABN , First Publish Date - 2022-11-30T02:04:04+05:30 IST

జల్సాలకు అలవాటు పడి ట్రాక్టర్లను చోరీ చేస్తున్న ముఠాను చివ్వెంల పోలీసులు పట్టుకున్నారు. రూ.20 లక్షల విలువ చేసే నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

 ట్రాక్టర్ల దొంగలు అరెస్టు

చివ్వెంల, నవంబరు 29: జల్సాలకు అలవాటు పడి ట్రాక్టర్లను చోరీ చేస్తున్న ముఠాను చివ్వెంల పోలీసులు పట్టుకున్నారు. రూ.20 లక్షల విలువ చేసే నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన దండుగుల శ్రీరాములు, చిలుకూరు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఓర్సు రవి, వీరి బంధువులైన మరో ఐదుగురు కొన్ని రోజులుగా కుటుంబసమేతంగా రాయి కొట్టే కూలి పనికి వెళుతున్నారు. ఈ క్రమంలో వ్యసనాలకు బానిసై పలు ప్రాంతాల్లో ట్రాక్టర్‌ను చోరీ చేశారు. ఈ ట్రాక్టర్లను విక్రయించేదుకు వెళుతుండగా సూర్యాపేట శివారులోని దురాజ్‌పల్లి వద్ద ఎస్‌ఐలు పి.విష్ణుమూర్తి, మధులు సిబ్బందితో తనిఖీ చేస్తుండగా నింది తులు శ్రీరాములు, రవి ట్రాక్టర్లతో సహా పట్టుబడ్డారు. నిందితుల నుంచి రూ.20 లక్షల విలువైన నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌, వనపర్తి జిల్లా కొత్తకోట, సూర్యాపేట జిల్లా కుడకుడ ప్రాంతం, చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామ శివారులోని క్వారీ ప్రాంతంలో ట్రాక్టర్లను దొంగిలించినట్లు నిందితులు అంగీకరిం చారు. శ్రీరాములు, రవిని పోలీసులు రిమాండ్‌కు తరలించగా, ఓర్సు ఏడుకొండలు, సంపంగి రవి, సంపంగి యాదగిరి, దండగుల నర్సింహులు, సంపంగి రాజశేఖర్‌ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. దొంగలను పట్టుకున్న సీఐ సోమనారాయణసింగ్‌, ఎస్‌ఐ విష్ణుమూర్తి, సిబ్బందిని ఆయన అభినందించారు.

మృతురాలిని గుర్తించడానికి పోస్టర్లు

దురాజ్‌పల్లి వద్ద ఈనెల 20వతేదీన గుర్తుతెలియని కాలిన మహిళ మృతదేహం లభ్యమైందని, ఆమె ఆచూకీని గుర్తించడానికి పోస్టర్లు అతికించామని డీఎస్పీ నాగభూషణం తెలిపారు. మహిళపై సమాచారం ఉన్నవారు వెంటనే పోలీస్‌ సిబ్బందిని సంప్రదించాలని డీఎస్సీ సూచించారు.

Updated Date - 2022-11-30T02:04:04+05:30 IST

Read more