ఎవరికి వారే

ABN , First Publish Date - 2022-07-05T05:50:27+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్‌ నే తల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నేతలు ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. వీరుఎవరికి వారు గా వ్యవహరిస్తుండటంతో హస్తవ్యస్తం అవుతోంది. ఏ కార్యక్రమాన్ని నిర్వహించాల న్నా ఒకరికి ఒకరు అడ్డుపడుతున్నారు.

ఎవరికి వారే
డాక్టర్‌ రవిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (ఫైల్‌)

కాంగ్రె్‌సలో భగ్గుమంటున్న విభేదాలు

బహిష్కృత నేత రవికి కాంగ్రెస్‌ కండువా కప్పిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఆ చేరిక చెల్లదని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రకటన


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్‌ నే తల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నేతలు ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. వీరుఎవరికి వారు గా వ్యవహరిస్తుండటంతో హస్తవ్యస్తం అవుతోంది. ఏ కార్యక్రమాన్ని నిర్వహించాల న్నా ఒకరికి ఒకరు అడ్డుపడుతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, చేరికలు, పీసీసీ అధ్యక్షు డి పర్యటన ఇలా ప్రతీఅంశం వివాదాస్పదమవుతోంది. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ బహిష్కృత నేత డాక్టర్‌ రవికి ఇటీవల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పడంతో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.


తుంగతుర్తి నియోజకవర్గం నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ 2014 అసెంబ్లీ ఎన్నిక ల్లో 2,381ఓట్లు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1,847 స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిషోర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల ముందు ఎస్సీ రిజర్వ్‌ నియోజకవర్గమైన తుంగతుర్తి నుంచి తన అనుచరుడు డాక్టర్‌ రవికి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించా రు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో డాక్టర్‌ రవి రెబల్‌గా బరిలో నిలవగా ఆయనకు 2,806 ఓట్లు పోలయ్యాయి. స్వల్ప ఓట్ల తేడాతో తాను ఓడటానికి రెబల్‌ అభ్యర్థి రవి కారణమని అద్దంకి దయాకర్‌ పీసీసీకి ఫి ర్యాదు చేశారు. దీంతో రవిని ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అయి తే డాక్టర్‌ రవిని తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేర్చేందుకు దామోదర్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌, వెంకట్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని అధిష్ఠానానికి అద్దంకి ఇటీవల ఫిర్యాదు చేశా రు. ఫిర్యాదుకే పరిమితం కాకుండా ఈ విషయంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో అద్దంకి దయాకర్‌కు అధిష్ఠానం షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేసింది. ఇదిలా ఉంటే గత నెల 26వ తేదీన డాక్టర్‌ రవికి భువ నగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన చేరికకు హాజరుకావాల్సిందిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని రవి సంప్రదించగా అందుకు ఆయన అనుమతించలేదు. జిల్లాకు చెందిన నేతలంతా అంగీకరిస్తేనే అంటూ రేవంత్‌ మెలిక పెట్టారు. రవిని ఆరేళ్ల పాటు పార్టీ బహిష్కరించిందని, ఈ నేపథ్యంలో ఆయన చేరిక చెల్లదంటూ దామోదర్‌రెడ్డి అనుచరుడు, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న అదే రోజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పార్టీలో చేరాలనుకుంటే రవి తొలుత టీపీసీసీ అధ్యక్షుడికి దరఖాస్తు చేసుకోవాలని, చేరికల కమిటీ చైర్మన్‌ జానారెడ్డి అనుమతి ఉండాలన్నారు. ఇవేవీ లేకుండా రవి చేరిక చెల్లదని ఆయన ప్రకటించారు. రవి చేరిక విషయాన్ని రాష్ట్ర ఇన్‌చార్జి మాణికంఠాగూర్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జి అద్దంకి దయాకర్‌ ఫిర్యాదు చేయగా ఆయన చేరిక చెల్లదంటూ అద్దంకికి సమాచారమిచ్చారు.


ఒక్కసారే వచ్చిన రేవంత్‌

నల్లగొండ జిల్లాలో పర్యటించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రయత్నించినా జిల్లా నేతలు అందుకు అడ్డు తగులుతూ వచ్చారు. వరంగల్‌లో రాహుల్‌ సభ పేరుతో రావాలని రేవంత్‌ చూసినా పార్టీ దిగ్గజాలుగా పేరొందిన జిల్లా నేతలు ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. ద్వితీయ శ్రేణి నాయకులు, టికెట్లు ఆశించే వారితో రేవంత్‌ జిల్లా పర్యటన చేయాల్సిందేనని, విజయవంతం చేసే బాధ్యత తమదేనంటూ ఓ వర్గం సమావేశం నిర్వహించింది. ఆ తరువాతే రేవంత్‌ నాగార్జునసాగర్‌లో సమన్వయ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో పహిల్వాన్లు ఉన్నారు.. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ వంటి జిల్లాల్లో పార్టీకి వాహనాలు సమకూర్చే దిక్కే లేదు.. రేవంత్‌ ఆ పని చూసుకుంటే చాలు.. నల్లగొండలో పర్యటించాల్సిన అవసరం లేదంటూ ఎంపీ వెంకట్‌రెడ్డి బహిరంగ వ్యాఖ్యానించా రు. టీపీసీసీ అధ్యక్షుడి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు సీనియర్‌ నేత జానారెడ్డి చొరవ చూపి అందరినీ ఆహ్వానించినా కోమటిరెడ్డి బ్రదర్స్‌ మాత్రం సాగర్‌ సమావేశానికి దూరంగా ఉన్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి భువనగిరి పార్లమెంట్‌ పరిధి బాధ్యతలను పార్టీ సీనియర్‌ నేత గీతారెడ్డి, పటేల్‌ రమే్‌షరెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించింది. వారికి ఎంపీ వెంకట్‌రెడ్డి సహకరించకపోవడంతో, వారు నియోజకర్గం పరిధిలో పర్యటించనేలేదు. నకిరేకల్‌, నల్లగొండ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు పార్టీ ఇన్‌చార్జీలే లేరు.


 వారు చెప్పిందే వేదం

సుదీర్ఘకాలంగా ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు నలుగురి చేతిలోనే ఉన్నాయని, స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు పలుమార్లు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఎక్కడికక్కడ ఆర్థిక, అంగ, సా మాజిక బలం ఉన్న నేతలకు స్వేచ్ఛ ఇస్తే 12 నియోజకవర్గాల్లో కనీసంగా 10 స్థానాలు దక్కడం ఖాయమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మిర్యాలగూ డ, నాగార్జునసాగర్‌, దేవరకొండ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం, నిర్ణయం జరగాలన్నా సీనియర్‌ నేత జానారెడ్డి పరిధిలోనే ఉంటుంది. హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో ఎంపీ ఉత్తమ్‌, నల్లగొండ, ఆలేరు, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడ ఏదిఏమైనా, గెలుపోటములను నిర్ణయించేది వీరే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాయకులు ఒకరి ఇలాఖాల్లోకి మరొకరు జోక్యం చేసుకోకపోవడంతో టీపీసీసీ పెద్దలు సైతం ఇటుగా చూసే సాహసం చేయడంలేదు. ఇదిలా ఉండగా, నేతల అంతర్గత కలహాలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-07-05T05:50:27+05:30 IST