కేసీఆర్‌ను జైలుకు పంపరెందుకు?

ABN , First Publish Date - 2022-06-12T06:35:32+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షలకోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ నేతలు చెబుతు న్నారే తప్ప, కేసీఆర్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు ఎందుకు పం పడంలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్‌ను జైలుకు పంపరెందుకు?
విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీ వెంకట్‌రెడ్డి

 ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 


నల్లగొండ, జూన్‌ 11: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షలకోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ నేతలు చెబుతు న్నారే తప్ప, కేసీఆర్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు ఎందుకు పం పడంలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం నల్లగొండలో ఆయన విలేకరుల తో మాట్లాడుతూ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేయడం బాధాకరమని, ఆ నోటీసులకు నిరసనగా 13న ర్యాలీ నిర్వహిస్తున్నామని, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసన తెలియజేయాల న్నారు. తెలంగాణలో అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వీటి నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి దొరుకుతుందని, రాష్ట్రాన్ని తాగుబోతుల రాజ్యంగా మా ర్చారని విమర్శించారు. నల్లగొండ పట్టణంలో ఏ కిరాణ షాపులో చూసినా గంజాయి విక్రయిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి రాలేదన్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రజాదర్బార్‌ నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సీఎంకు ఎలాగో చేతకాదని, 12గంటల వరకు లేవడని, ఓ మహిళగా ఆమె దర్బార్‌ నిర్వహించ డం అభినందనీయమన్నారు.  

Read more