వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2022-06-07T06:34:22+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమా దాల్లో ముగ్గురు మృతిచెందారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని రామన్నగూడెం శివారులో సోమవారం లారీ, కారును ఢీకొని మహిళ మృతిచెందింది. ఎస్‌ఐ పి.పరమేష్‌ తెలిపిన వివ

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
పెద్దవూర మండలం రామన్నగూడెంలో ప్రమాదానికి గురైన కారును పరిశీలిస్తున్న పోలీసులు

పెద్దవూర, జూన్‌ 6: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమా దాల్లో ముగ్గురు మృతిచెందారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని రామన్నగూడెం శివారులో సోమవారం లారీ, కారును ఢీకొని మహిళ మృతిచెందింది. ఎస్‌ఐ పి.పరమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం ఏపీ రాష్ట్రం పల్నాడు జిల్లా దుర్గి మండలం ముట్కూరు గ్రామానికి చెందిన లింగా శ్రీని వాస్‌రావు, వెంకటరమణ దంపతులు హైదరాబాద్‌ నుంచి కూతురి కుమా రుడు కాత్విక్‌తో కలిసి సుజికి ఎర్టికా కారులో స్వగ్రామమైన ముట్కూరుకు బయలుదేరారు. నర్సారా వుపేటకు చెందిన లారీ మాచర్లలో బండల లోడ్‌తో హైదరాబాద్‌కు వెళ్తుండగా పెద్దవూర మండలం రామన్నగూడెం సమీపంలోకి రాగానే లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారులో ఉన్న వెంకటరమణ(45) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. భర్త శ్రీనివాస్‌రావుకు, మనుమడు కాత్విక్‌కు గాయాల య్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. కాత్విక్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హై దరాబాద్‌కు తరలించారు. వెంకటరమణ మృతదేహానికి పోస్టుమార్టం ని ర్వహించి బంధువులకు అప్పగించారు. భర్త శ్రీనివాస్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ మహమ్మద్‌ హాసన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


బైక్‌ ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు 

చింతపల్లి: చింతపల్లి మండలంలోని కుర్మేడు స్టేజీ వద్ద ఆదివారం రాత్రి బైక్‌ ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు. ఏఎస్‌ఐ భిక్షం తెలిపిన వివరాల ప్రకా రం.. కుర్మేడు స్టేజీ సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడు రోడ్డు దాటుతుండగా బైక్‌ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన వృద్ధుడిని అదే రోజు రాత్రి దేవరకొండ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ సోమవారం మృతిచెం దాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఏపీ29 బీఎఫ్‌ 3676 నంబరు గల బైక్‌ను అక్కడే వదిలి పరారయ్యాడు. బైక్‌ విషయాన్ని పోలీసులు ఆరా తీయగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌ గ్రామానికి చెందిన మల్లోజు యాదగిరికి చెందినదిగా గుర్తించామని ఏఎస్‌ఐ తెలిపారు. వాహన యజమానిని సెల్‌ఫోన్‌లో సంప్రదించగా తాను 2018లోనే చింతపల్లి మం డలం కుర్మపల్లి గ్రామానికి చెందిన దోరేపల్లి యాద య్యకు విక్రయించినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. వృద్ధుడి మృతదేహాన్ని దేవరకొండ సివిల్‌ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడి ఆచూకీ తెలిసినవారు ఎస్‌ఐ సెల్‌. 9440700077కు సమాచారం ఇవ్వాలని కోరారు. 


రోడ్డు ప్రమాదంలో గాయపడి.. 

చిలుకూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సూర్యా పేట జిల్లా చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామా నికి చెందిన కొట్టె కోటయ్య(52) చికిత్సపొందుతూ ఆది వారం రాత్రి మృతిచెందాడు. కోటయ్య కోదాడ నుంచి బేత వోలుకు శనివారం బైక్‌పై వస్తుండగా, బేతవోలు క్రాస్‌ రోడ్డు వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గాయపడిన కోటయ్యను ఖమ్మం వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. కోటయ్య కు మారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-06-07T06:34:22+05:30 IST