సాహిత్యంలో తిరుగులేని కవి ‘తిరునగరి’

ABN , First Publish Date - 2022-10-01T06:00:42+05:30 IST

తెలుగు సాహిత్యంలో తిరుగులే ని కవి తిరునగరి అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ నందిని సిదారెడ్డి అన్నారు.

సాహిత్యంలో తిరుగులేని కవి ‘తిరునగరి’
సాహితీ వేత్త దోరవేటిని పురస్కారంతో సన్మానిస్తున్న సిదారెడ్డి

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిదారెడ్డి 

ఆలేరు, సెప్టెంబరు 30: తెలుగు సాహిత్యంలో తిరుగులే ని కవి తిరునగరి అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ నందిని సిదారెడ్డి అన్నారు. కవన మిత్ర సాహిత్య సాంస్కృతిక సే వా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఆలేరు పట్టణంలోని రామకృష్ణ విద్యాలయంలో జరిగిన పురస్కా ర ప్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పద్యం, గేయం, వచనం మూడు ప్రక్రియల్లో ఆయన గొప్ప రచనలు చేశారని చెప్పారు. దాశరథి పురస్కారం ఆయనను వరించడం, ఆయనలోని ప్రతిభకు నిదర్శనమన్నారు. సాహితీవేత్త డాక్టర్‌ పెసరు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కవిత్వంలో తిరునగరిది అందవేసిన చేయి అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన సాహితీవేత్త దోరవేటి, కరీంనగర్‌కు చెందిన సాహితీవేత్త వెనుగొండ సరసిజను రూ.5,116 నగ దు పురస్కారంతో సన్మానించారు. కవనమిత్ర సేవా సంస్థ అధ్యక్షుడు పెసరు లింగారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సాహితీవేత్తలు బండి రాజుల శంకర్‌, డాక్టర్‌ పోరెడ్డి రంగయ్య, బండారు జయశ్రీ, తొర్ర ఉప్పలయ్య, బోగ హరినాద్‌, దేవినేని అరవిందరాయుడు, ప్రదీప్‌, ప్రభా భారతీతో పాటు శ్రీ రామకృష్ణ విద్యాలయం అధ్యాపకులు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. 

Read more