బూరుగడ్డలో దాహం..దాహం

ABN , First Publish Date - 2022-09-26T07:11:37+05:30 IST

మండలంలోని బూరుగడ్డలోని మాచవరం గ్రామంలో మంచినీళ్ల కోసం మహిళలు ధర్నాకు దిగారు. ఆది వారం మధ్యాహ్నం మాచవరంలోని మిషన్‌ భగీరథ ట్యాంకు వద్ద గ్రామ స్థులు ధర్నా చేసి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బూరుగడ్డలో దాహం..దాహం

హుజూర్‌నగర్‌ రూరల్‌, అక్టోబరు 15: మండలంలోని బూరుగడ్డలోని  మాచవరం గ్రామంలో మంచినీళ్ల కోసం మహిళలు ధర్నాకు దిగారు. ఆది వారం మధ్యాహ్నం మాచవరంలోని మిషన్‌ భగీరథ ట్యాంకు వద్ద గ్రామ స్థులు ధర్నా చేసి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా పలువురు మాట్లాడుతూ 20 రోజులుగా నీరు సరఫరా కానందున  స్నానాలు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నామన్నారు. గ్రామపంచాయతీ నల్లా పైపులకు సంబంధించి గేట్‌వాల్వ్‌ ఽధ్వంసమైనా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహించకుడా  ఇతర మండలాల్లో నివసిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.   కార్యక్రమంలో పొదిల పిచ్చయ్య, పొదిల వీర బాబు, శంకర్‌, వేణు, అలివేలమ్మ, ధనమ్మ, లింగమ్మ, మహాలక్ష్మమ్మ, పిచ్చమ్మ, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 మాచవరంలో మిషన్‌ భగీరథ ట్యాంకు ఎదుట ధర్నా చేస్తున్న గ్రామస్థులు 

Read more