బేతవోలులో రెండు ఇళ్లలో చోరీ

ABN , First Publish Date - 2022-04-24T06:09:05+05:30 IST

మండలంలోని బేతవోలులో రెండు ఇళ్లలో శనివారం చోరీ జరిగింది. 38తులాల బంగారం, రూ.36 వేల నగదు అపహరించారు. గ్రామ మాజీ సర్పంచ్‌ కల్లు క్రిష్ణారెడ్డి ఇంట్లో 35తులాల బంగారం, రూ. 25 వేల నగదు, ఎగ్గడి క్రిష్ణవేణి ఇంట్లో మూడు తులాల బంగారం, రూ.11 వేల నగదు ఎత్తుకెళ్లారు. కల్లు క్రిష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సూర్యాపేటలో జరుగుతున్న

బేతవోలులో రెండు ఇళ్లలో చోరీ

చిలుకూరు, ఏప్రిల్‌ 23: మండలంలోని బేతవోలులో రెండు ఇళ్లలో శనివారం చోరీ జరిగింది. 38తులాల బంగారం, రూ.36 వేల నగదు అపహరించారు. గ్రామ మాజీ సర్పంచ్‌ కల్లు క్రిష్ణారెడ్డి ఇంట్లో 35తులాల బంగారం, రూ. 25 వేల నగదు, ఎగ్గడి క్రిష్ణవేణి ఇంట్లో మూడు తులాల బంగారం, రూ.11 వేల నగదు ఎత్తుకెళ్లారు. కల్లు క్రిష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సూర్యాపేటలో జరుగుతున్న బంధువుల ఇంట్లో శుభకార్యానికి శనివారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం ఇంటితాళం పగులగొట్టి కనిపించడంతో దొంగలు పడ్డారని భావించి ఇంటి పక్కన వాళ్లు క్రిష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. సూర్యాపేట నుంచి గ్రామానికి చేరుకున్న క్రిష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి బీరువా తాళాలు పగులగొట్టి ఉండడం, బంగారం నగలు దొంగతానికి గురికావడంతో సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎగ్గడి క్రిష్ణవేణి కుమార్తెను పాఠశాలకు పంపి కోదాడ మండలంలోని రామాపురం గ్రామానికి బంధువుల ఇంటికి వెళ్ళింది. పాఠశాల నుంచి వచ్చిన కుమార్తె ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో తల్లికి చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించారు. 

Read more