మొబైల్‌ దుకాణంలో చోరీ

ABN , First Publish Date - 2022-07-18T06:08:20+05:30 IST

నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని ఓ మొబైల్‌ దుకాణం లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది.

మొబైల్‌ దుకాణంలో చోరీ

నార్కట్‌పల్లి, జూలై 17: నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని ఓ మొబైల్‌ దుకాణం లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఎదురుగా ఉన్న లక్ష్మి మొబైల్‌ దుకాణంలో సుమారు రూ.80 వేల విలువైన 15 మొబైల్‌ ఫోన్లను ఆగంతకుడు అపహరించుకుపోయాడు. షాపు యజమాని గంగాధర్‌ తెలిపి న వివరాల ప్రకారం... శనివారం రాత్రి రోజు మాదిరిగానే రాత్రి 10 గంటలకు షాపు మూసివేసి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం షట్టర్‌ తెరిచి చూడగా దుకాణంలో వస్తువులు చిందరవందరగా ఉండటంతో పాటు పైకప్పు రేకులను తొలగించి ఉన్నా యి. దీంతో దుకాణం మొత్తం చూడగా గుర్తు తెలియని వ్యక్తి సుమారు రూ. 80వేల విలువైన 15 4జీ నెట్‌వర్క్‌ సామర్థ్యం గల ఫోన్లను అపహరించుకుపోయినట్లు షాపు లో ఉన్న సీసీ కెమెరాలో నమోదైంది. ఈ సంఘటనపై పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేసినట్లు గంగాధర్‌ తెలిపాడు.
Read more