పేదల అభ్యున్నతి కాంగ్రెస్‌తోనే సాధ్యం

ABN , First Publish Date - 2022-05-30T06:11:11+05:30 IST

పేదల అభ్యున్నతి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం రాజాపేట మండలం పాముకుంట, మొల్లగూడెం, జాల, కొత్త జాల, కుర్రారం, బూరుగుపల్లి, పారుపల్లి, గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ ర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పేదల అభ్యున్నతి  కాంగ్రెస్‌తోనే సాధ్యం
సింగారం గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య

 కాంగ్రెస్‌  పార్టీ  ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య 

 రాజాపేట, మే 29: పేదల అభ్యున్నతి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం రాజాపేట మండలం పాముకుంట, మొల్లగూడెం, జాల, కొత్త జాల, కుర్రారం, బూరుగుపల్లి, పారుపల్లి, గ్రామాల్లో  కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ ర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్‌ పార్టీ  జెండాను ఆవిష్కరించారు. వరంగల్‌ డిక్లరేషన్‌ పత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని, డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యా వసర ధరలను పెంచి ప్రజలపై పెనుభారం మోపాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేందర్‌గౌడ్‌, సిలివేరు బాలరాజు, బుడిగె పెంటయ్య, రాంజీనాయక్‌, విఠల్‌ నాయక్‌, సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

ప్లోరిన్‌ రహిత నీటిని అందిస్తా

  ఫ్లోరిన్‌ లేని నీటిని అందించడమే తన లక్ష్యమని బీర్ల ఫౌండేషన్‌ చైర్మన్‌ బీర్ల అయిలయ్య అన్నారు. రాజాపేట మం డలం పాముకుంట గ్రామంలో బీర్ల ఫౌండేషన్‌  సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదల కోసం బీర్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.   కార్య క్రమంలో నాయకులు మహేందర్‌గౌడ్‌, సిలివేరు బాలరాజు, పెంటయ్య, సురేం దర్‌రెడ్డి, షరీఫ్‌, రాంజీ, విఠల్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.Read more