బతుకమ్మ విశిష్టతను భావితరాలకు అందించాలి

ABN , First Publish Date - 2022-09-28T05:56:49+05:30 IST

భావిత రాలకు బతు కమ్మ పండుగ విశిష్టతను చెప్పాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, డీఆర్‌డీఏ పీడీ సుందరి కిరణ్‌కుమార్‌ అన్నారు.

బతుకమ్మ విశిష్టతను భావితరాలకు అందించాలి
సూర్యాపేటలో బతుకమ్మ వేడుకలు

సూర్యాపేట కల్చరల్‌ / కోదాడ రూరల్‌, సెప్టెంబరు 27 : భావిత రాలకు బతు కమ్మ పండుగ విశిష్టతను చెప్పాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, డీఆర్‌డీఏ పీడీ సుందరి కిరణ్‌కుమార్‌ అన్నారు. సూర్యాపేటలోని సద్దులచెరువు వద్ద డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ముద్దపప్పు బతుకమ్మ వేడుకల్లో వారు మాట్లాడారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు ఆకుల కవిత, రాపర్తి శ్రీనివా్‌సగౌడ్‌, ఎడ్ల గంగాభవాని, చింతలపాటి భరత్‌మహాజన్‌ మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. కోదాడ మండలం గణప వరంలో గురువయ్య స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు బాలబోయిన గురవయ్య, కొండా వీరకుమారి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆకర్షినీయ బతుకమ్మలకు బహుమతులు ప్రధానం చేశారు.Read more