‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-05-18T06:23:17+05:30 IST

ఈ నెల 23వ తేదీ నుంచి జరిగే 10 వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో భిక్షప తి అన్నారు.

‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో భిక్షపతి

కొండమల్లేపల్లి, మే 17: ఈ నెల 23వ తేదీ నుంచి జరిగే 10 వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో భిక్షప తి అన్నారు. మంగళవారం పట్టణంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో చీఫ్‌ సూ పరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పరీక్ష సమయంలో సెల్‌ఫోన, జేబులో ఎలాంటి కాగితాలు తీసుకురాకుండా జాగ్రత్త పడాల ని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో ఎవరైనా అధికారులు మాస్‌ కాపీయింగ్‌కు పా ల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఆయన వెంట విద్యాధికారులు యూసుఫ్‌, షరీఫ్‌, కొమ్ము శ్రీనివాసులు, మాత్రునాయక్‌, సత్యనారాయణ, మండలాల అధికారులు, పరీక్ష కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. 


Read more