విద్యార్థినికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-07-05T07:29:00+05:30 IST

నల్లగొండ జిల్లా డిండి మండల కేం ద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తర గతి చదువుతున్న విద్యార్థినికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

విద్యార్థినికి కరోనా పాజిటివ్‌

నల్లగొండ జిల్లా డిండి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘటన 

డిండి, జూలై 4: నల్లగొండ జిల్లా డిండి మండల కేం ద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తర గతి చదువుతున్న విద్యార్థినికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విద్యార్థినికి జ్వరం రావడంతో తల్లిదం డ్రులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తెలిసిందని డాక్టర్‌ రఘురాం తెలిపారు. విద్యార్థినికి కరోనా కిట్‌ అందజేసి హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. దీంతో ఆమెతోపాటు చదువుతున్న మరో 13 మంది బాలి కలకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారం దరికీ నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని తెలిపారు. విద్యార్ధిని తల్లి దండ్రులు స్థానికంగా కూలీ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. వారికి కరోనా లక్షణాలు లేకపోవడంతో నిర్ధా రణ పరీక్షలు చేయలేదని తెలిపారు.


Read more