స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం మరువలేనిది

ABN , First Publish Date - 2022-08-10T06:32:44+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం మరువలేనిదని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. మంగళవారం రాజాపేట మండలం రేణికుంటలో 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుడు చింతలపుడి జనార్ధన్‌రెడ్డితోపాటు పలువురిని ఘనంగా సన్మానించారు.

స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం మరువలేనిది
రాజాపేట మండలం రేణికుంటలో స్వాతంత్ర సమరయోధుడు జనార్ధన్‌రెడ్డిని సన్మానిస్తున్న విప్‌ సునీత, కలెక్టర్‌ పమేలాసత్పథి

ప్రభుత్వ విప్‌ సునీత, కలెక్టర్‌ పమేలాసత్పథి

రాజాపేట, ఆగస్టు 9: స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం మరువలేనిదని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. మంగళవారం రాజాపేట మండలం రేణికుంటలో 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుడు చింతలపుడి జనార్ధన్‌రెడ్డితోపాటు పలువురిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర స్ఫూర్తిని ముందుకు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశస్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలు, చేసిన పోరాటం వెలకట్టలేనివన్నారు. ముందుగా సీహెచ్‌ రాంరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాంరెడ్డి రైతాంగానికి అండగా నిలిచారని గుర్తుచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, సర్పంచ్‌ భాగ్యమ్మ, ఎంపీపీ బాలమణి, పీఏసీఎస్‌ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, నాయకులు వెంకటరాంరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రవీణ్‌, బాలనర్సయ్య, భాస్కర్‌, తిరుపతిరెడ్డి, నర్సింహులు, రాఘవరెడ్డి పాల్గొన్నారు. 

Read more