జాతీయస్థాయిలో రాష్ట్రానికి పేరుతేవాలి

ABN , First Publish Date - 2022-09-29T06:10:24+05:30 IST

జాతీయస్థాయిలో జరిగే యోగాసన పోటీల్లో బహుమతులు సాధించి రాష్ట్రానికి మంచి పేరు, గుర్తింపు తేవాలని తెలంగాణ యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అఽధ్యక్షుడు శ్రీధర్‌ కోరారు.

జాతీయస్థాయిలో రాష్ట్రానికి పేరుతేవాలి
నిజామాబాద్‌ జిల్లా జట్టుకు ప్రథమ బహుమతి ప్రదానం చేస్తున్న శ్రీధర్‌

 టీవైఎ్‌సఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌

 ముగిసిన రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు

నల్లగొండ, సెప్టెంబరు 28: జాతీయస్థాయిలో జరిగే యోగాసన పోటీల్లో బహుమతులు సాధించి రాష్ట్రానికి మంచి పేరు, గుర్తింపు తేవాలని తెలంగాణ యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అఽధ్యక్షుడు శ్రీధర్‌ కోరారు. జిల్లాకేంద్రంలోని చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్‌ ఛాంపియన్‌షి్‌ప పోటీల ముగింపు వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. నల్లగొండలో రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీల్లో ఎంపికైన 54మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో త్వరలో ధిల్లీలో జరిగే పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. యోగాసనాల వల్ల జ్ఞానం, ఏకాగ్రత పెరుగుతాయన్నారు. అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్‌ మాట్లాడుతూ పోటీల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓడినవారు గెలుపుకోసం ప్రయత్నం చేయాలన్నారు. యోగాసన పోటీలకు హాజరైన ఎంజీయూ వైస్‌ ఛాన్స్‌లర్‌ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి యో గా కోర్సు ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించారు. పోటీల ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ బోయపల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మూడురోజుల పాటు నల్లగొండ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు ఉమ్మడి 10 జిల్లాల క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను చాటుకున్నారన్నారు. అనంతరం సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ బాలబాలిక విభాగాల్లో మొత్తం 36 మంది విజేతలకు గోల్డ్‌, 36 మంది క్రీడాకారులకు సిల్వర్‌, 36 మంది క్రీడాకారులకు బ్రాంజ్‌ మెడల్స్‌తోపాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మూడు రోజులపాటు నల్లగొండలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు విజయవంతంగా ముగిశాయి. కార్యక్రమంలో రాంరెడ్డి, రాంచందర్‌, రామరాజు, తోట సతీష్‌, జిల్లా అఽధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కోట సింహాద్రి, ఆర్‌. శ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, నాగులపల్లి శ్యాంసుందర్‌, రెఫరీలు, న్యాయనిర్ణేతుల, కోచ్‌లు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.   


యోగా ఛాంపియన్‌గా నిజామాబాద్‌  

యోగాసన పోటీల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిజామాబాద్‌ జిల్లా ప్రఽఽఽథమ స్థానంలో నిలిచింది. ద్వితీయస్థానంలో ఆదిలాబాద్‌ జిల్లా జట్టు, తృతీయ స్థానంలో సిద్దిపేట జిల్లా జుట్ట నిలిచింది. వీరికి బహుమతులను రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌, ప్రధాన కార్యదర్శి నందనం కృపాక ర్‌, కమిటీ చైర్మన్‌ బోయపల్లి కృష్ణారెడ్డి అందజేశారు.  

Updated Date - 2022-09-29T06:10:24+05:30 IST