సబ్బండ కులాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2022-12-30T00:34:51+05:30 IST

సబ్బండ కులాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

సబ్బండ కులాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
హోలియో దాసరి కులస్తుల సమ్మేళనానికి ర్యాలీగా వెళ్తున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

కోదాడ, డిసెంబరు 29 : సబ్బండ కులాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. కోదాడ పట్టణంలోని గాంధీనగర్‌లో హోలియో దాసరి కుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. గత పాలకవర్గాలు వెనకబడిన కులాలను ఓటు బ్యాంకుగా చూశారే తప్ప వారి అభ్యున్నతికి చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, మునిసిపాలిటీ వైస్‌చైర్మన సంఘం అధ్యక్షుడు ఉమ్మినేని గోపి, పిట్టల శ్రీను, ఆవుల మల్లేశ్వరరావు, బెజవాడ శిరీష, శ్రావణ్‌, ఒంటి పులి రమాశ్రీనివాస్‌, గుండెల సూర్యనారాయణ, కోట మధుసుదన, ఖదీర్‌భాష, కట్టెబోయిన జ్యోతి శ్రీనివా్‌సయాదవ్‌, కల్లూరి పద్మజ పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో టీయూడబ్ల్యూజేహెచ-143 యూనియన జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సన్మానించి, మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కారింగుల అంజన్నగౌడ్‌, టీయూడబ్ల్యూజేహెచ-143 జిల్లా ప్రధానకార్యదర్శి నారపరాజు హరికిషన , జిల్లా కోశాధికారి పడిశాల రఘు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు బంక వెంకటరత్నంలను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యూనియన సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:34:51+05:30 IST

Read more