విద్యాభివృద్ధిలో ప్రైవేట్‌ పాఠశాలల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2022-05-18T05:59:52+05:30 IST

విద్యాభివృద్ధిలో ప్రైవేట్‌పాఠశాలలది కీలక పా త్రని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. తె లంగాణ రికగ్జ్నైజ్‌డ్‌ స్కూల్స్‌ మేనేజ్మెం ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన మాట్లాడారు.

విద్యాభివృద్ధిలో ప్రైవేట్‌ పాఠశాలల పాత్ర కీలకం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి 

నల్లగొండ టౌన్‌, మే 17: విద్యాభివృద్ధిలో ప్రైవేట్‌పాఠశాలలది కీలక పా త్రని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. తె లంగాణ రికగ్జ్నైజ్‌డ్‌ స్కూల్స్‌ మేనేజ్మెం ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రైవేట్‌ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందించారు. ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా అత్యధికంగా నష్టపోయింది ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు,ఉపాధ్యాయులేనని అన్నారు. ప్రైవేట్‌ విద్యా సం స్థల యాజమాన్యాల సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్‌రెడ్డి, కోశాధికారి రవి సురేష్‌, నా యకులు యానాల ప్రభాకర్‌రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, ము క్కాముల నర్సింహ, అజీజ్‌, పుచ్చకాయల వెంకట్‌రెడ్డి, అశోక్‌, అలుగుబెల్లి తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పట్టణంలో మంత్రి జగదీ్‌షరెడ్డి సుడిగాలి పర్యటన 

జిల్లాకేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి జగదీ్‌షరెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. వల్లభరావు చెరువు, పానగల్‌ ఉదయ సముద్రం, మినీ ట్యాంక్‌బండ్లపై చేపట్టే అభివృద్ధి పనులను పరిశీలించారు. సకాలంలో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కేవీ రమణాచారి, మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, తదితరులు ఉన్నారు.

Read more