భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-14T05:27:22+05:30 IST

చర్లగూడెం రిజర్వాయర్‌లో భూ ములు కోల్పోయిన తమ సమస్యలను పరిష్కరించాలని భూ నిర్వాసితులు, రైతులు డిమాండ్‌ చేశారు.

భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి

మర్రిగూడ, సెప్టెంబరు 13: చర్లగూడెం రిజర్వాయర్‌లో భూ ములు కోల్పోయిన తమ సమస్యలను పరిష్కరించాలని భూ నిర్వాసితులు, రైతులు డిమాండ్‌ చేశారు. తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి మంత్రి జగదీ్‌షరెడ్డి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న నిర్వాసితులు అక్కడికి వెళ్లారు. వినతి ప త్రం సమర్పించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇది గమనించిన మంత్రి జగదీ్‌షరెడ్డి కారులో వెళ్తుండగా భూ నిర్వాసితులను చూసి దగ్గరకు పిలిపించుకుని వా రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రి జర్వాయర్‌లో వ్యవసాయ భూములు కోల్పోయిన శివన్నగూడ, రాం రెడ్డిపల్లి, అజిలాపురం, ఖుదాభక్షిపల్లి రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకే జీ అందేవిధంగా చూడాలని కోరారు. చర్లగూడెం రిజర్వాయర్‌లో నాలుగు గ్రామాలకు సంబంధించిన 2,115ఎకరాల వ్యవసాయ భూ ములను ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మేం పూర్తిగా ఉపాధి కోల్పోయామని తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తించే విధంగా చూడాలని మంత్రిని వేడుకున్నారు. దీనికి స్పం దించిన మంత్రి జగదీ్‌షరెడ్డి మాట్లాడుతూ మీ డిమాండ్లను ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని అన్నా రు. భూ నిర్వాసితులు తిరిగి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేస్తున్న దీక్షా స్థలికి వెళ్లి నిరాహార దీక్ష కొనసాగించారు. 

Read more