లారీ యజమానులకు పోలీసులు సహకరించాలి

ABN , First Publish Date - 2022-06-11T06:25:02+05:30 IST

పోలీసులు లారీ యజమానులకు సహక రించాలని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామినేని శ్రీనివాసరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆవుల రామారావు కోరారు. కోదాడ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరెడ్డిని డీఎస్పీ కార్యా లయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి మాట్లాడారు.

లారీ యజమానులకు పోలీసులు సహకరించాలి
కోదాడలో డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డిని సన్మానిస్తున్న లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు

కోదాడటౌన్‌, జూన్‌ 10: పోలీసులు లారీ యజమానులకు సహక రించాలని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామినేని శ్రీనివాసరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆవుల రామారావు కోరారు. కోదాడ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరెడ్డిని డీఎస్పీ కార్యా లయంలో  శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి మాట్లాడారు. కరోనా కారణంగా రవాణా రంగం పూర్తిగా దెబ్బతిందని, రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలతో కష్టాల్లో ఉన్నామని, పోలీ సుల జరిమానాలతో తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. ఇలాంటి ఆపత్కాలంలో లారీ యజమానులకు పోలీసులు సహకరించాలని కోరారు. డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి  మాట్లాడుతూ లారీ యజమానులు నిబంధనల మేరకు రవాణా రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కోదాడ అధ్యక్షుడు కనగాల నాగేశ్వర రావు, కొల్లు ప్రసాద్‌, ఎండీ రఫీ, షేక్‌ జాని, దొంగరి సుధాకర్‌, నర్సింహా రావు, నరేష్‌, ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.Read more