బీసీలను విస్మరించిన పార్టీలకు మూల్యం తప్పదు

ABN , First Publish Date - 2022-10-08T06:22:22+05:30 IST

మునుగోడులో బీసీలను విస్మరించిన పార్టీలకు మూల్యం తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. చౌటుప్పల్‌ మండలకేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

బీసీలను విస్మరించిన పార్టీలకు మూల్యం తప్పదు
సమావేశంలో మాట్లాడుతున్న జాజుల శ్రీనివా్‌సగౌడ్‌

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌

చౌటుప్పల్‌, అక్టోబరు 7: మునుగోడులో బీసీలను విస్మరించిన పార్టీలకు మూల్యం తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. చౌటుప్పల్‌ మండలకేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో 67శాతం బీసీలు ఉన్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలి పి 93శాతం ఉన్నారన్నారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలను ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రె్‌సలు విస్మరించాయని ఆరోపించారు. మూడుపార్టీలు సైతం తమ టిక్కెట్లను రెడ్డి సామాజికవర్గానికే ఇచ్చి మరోసారి తమ అగ్రకుల ఆధిపత్యాన్ని చాటుకున్నారన్నారు. ఇన్నాళ్లు  కేసీఆర్‌ బీసీలకు టిక్కెట్లు ఇస్తారని ఆశించామని, కేసీఆర్‌ సైతం రెడ్డిల కే పట్టం కట్టారని ధ్వజమెత్తారు. బీసీలను అన్నిపార్టీలు ఓటు బ్యాంక్‌గానే వినియోగించుకుంటున్నాయన్నారు. మూడు పార్టీలు ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం సిగ్గుచేటన్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పలానుకుంటున్న కేసీఆర్‌ దేశంలో 70 కోట్లకుపైగా ఉన్న బీసీలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. మునుగోడులో బీసీ ప్రజల మనోభావాలను దెబ్బతిసిన పార్టీలకు ఇవే చివరి ఎన్నికలని హెచ్చరించారు. అన్నిపార్టీలు కలిసి మునుగోడును రెడ్డిగోడుగా మార్చాయన్నారు. తాము రెడ్డిలకు వ్యతిరేకం కాదని, రాజకీయ ఆధిపత్యం చేసే రెడ్డిలకు మాత్రమే వ్యతిరేకమన్నారు. ఈ నెల 9న మునుగోడు నియోజకవర్గంలో అన్ని బీసీ సంఘాలతో కలిసి సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ వెల్లడిస్తామన్నారు. సమావేశంలో బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్‌, మండల అధ్యక్షుడు ఆదిమూలం శంకర్‌, బండిగారి వెంకన్న, కొత్తభాను, బూర్గు సాయి పాల్గొన్నారు. 

Read more