బీజేపీని ఓడించడమే కమ్యూనిస్టుల ధ్యేయం

ABN , First Publish Date - 2022-10-08T05:49:52+05:30 IST

దేశంలో మతవాద రాజకీయాలతో విద్వేషాలు రేపుతూ ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించటమే కమ్యూనిస్టుల ధ్యేయమని సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు.

బీజేపీని ఓడించడమే కమ్యూనిస్టుల ధ్యేయం
సమావేశంలో మట్లాడుతున్న పల్లా వెంకట్‌రెడ్డి

సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి

మునుగోడు, అక్టోబరు 7: దేశంలో మతవాద రాజకీయాలతో విద్వేషాలు రేపుతూ ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించటమే కమ్యూనిస్టుల ధ్యేయమని సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. మునుగోడులో జరిగిన సీపీఐ నియోజకవర్గ స్థాయి ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మునుగోడులో జరిగే ఉపఎన్నికలో బీజేపీని ఓడించి టీఆర్‌ఎస్‌ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు శ్రమించి పనిచేయాలని పిలుపునిచ్చారు. గురిజ రామచంద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పార్టీ కార్యదర్శులు నెల్లికంటి సత్యం, గోద శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, నాయకులు కె. శ్రీనివాస్‌, మందడి నర్సింహారెడ్డి, మండల కార్యదర్శి చాపల శ్రీను, వెంకటేశ్వర్లు, కైలాసం తదితరులు పాల్గొన్నారు.Read more