పిడుగు పాటుకు కల్లుగీత కార్మికుడు మృతి

ABN , First Publish Date - 2022-06-07T06:33:11+05:30 IST

పిడుగుపాటుకు కల్లు గీత కార్మికుడు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఆదివారం రాత్రి ఈ సంఘ టన జరిగింది. స్థానికులు, చిట్యాల ఎస్‌ఐ-3 శంకరయ్య తెలిపిన సమాచారం మేరకు.. వెలిమినేడు గ్రామానికి చెందిన గీత కార్మికుడు అం

పిడుగు పాటుకు కల్లుగీత కార్మికుడు మృతి
శివకుమార్‌ (ఫైల్‌)

చిట్యాలరూరల్‌, జూన్‌ 6: పిడుగుపాటుకు కల్లు గీత కార్మికుడు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఆదివారం రాత్రి ఈ  సంఘ టన జరిగింది. స్థానికులు, చిట్యాల ఎస్‌ఐ-3 శంకరయ్య తెలిపిన సమాచారం మేరకు.. వెలిమినేడు గ్రామానికి చెందిన గీత కార్మికుడు అంతటి శంకరయ్య, చంద్రమ్మ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు శివకుమార్‌ (28) అవివాహితుడు కాగా, తండ్రితో కలిసి కులవృత్తి చేస్తున్నాడు. మరో ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం గ్రామ శివారులో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తూ పిడుగు పడింది. అదే సమయంలో సైకిల్‌పై వస్తున్న శివకుమార్‌ అక్కడి కక్కడే మృతిచెందాడు. శివకుమార్‌ ఇంటికి చేరకపోవడంతో కుటుం బసభ్యులు ఆందోళనకు గురై ఫోన్‌ చేయగా పనిచేయకపోవడంతో వ్యవసా య బావుల వద్ద ఉండే వారికి ఫోన్‌ చేశారు. వారు తాటిచెట్ల సమీపంలో  దారిలో చూడగా సైకిల్‌తో పాటుగా శివకుమార్‌ కిందపడి ఉన్నాడు. సమా చారం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని పరి శీలించగా అప్పటికే శివకుమార్‌ మృతిచెందాడు. తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కల్లు గీసిన అనంతరం ఇంటికి బయలుదేరిన శివకుమార్‌ సెల్‌ఫోన్‌ను జేబులో పెట్టుకున్నాడు. ఉరు ములు మెరుపులు, వర్షంతోపాటు పిడుగుపడటంతో సెల్‌ఫోన్‌ పేలిపోయింది.

Read more