కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలి

ABN , First Publish Date - 2022-10-08T05:42:02+05:30 IST

మునుగోడును మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు వచ్చే నెల మూడోతేదీన జరగనున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌ రావు, ఎమ్మెల్యే ఎన.భాస్కర్‌రావు కోరారు.

కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలి
చౌటుప్పల్‌లో సంబరాలలో ఎమ్మెల్సీ రవీందర్‌రావు, ఎమ్మెల్యే భాస్కర్‌రావు

 ఎమ్మెల్సీ రవీందర్‌ రావు, ఎమ్మెల్యే భాస్కర్‌ రావు

చౌటుప్పల్‌ టౌన, అక్టొబరు 7: మునుగోడును మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు  వచ్చే నెల మూడోతేదీన జరగనున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌ రావు, ఎమ్మెల్యే ఎన.భాస్కర్‌రావు కోరారు. మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌  శుక్రవారం ప్రకటించగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ చౌటుప్పల్‌ పట్టణంలోని జాతీయ రహదారిపై బాణసంచా కాల్చి, మిఠాయిలను పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాల పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని వారు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన వెనరెడ్డి రాజు, ఏఎంసీ చైర్మన బొడ్డు శ్రీనివాస్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన చింతల దామోదర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు గిర్కటి నిరంజన గౌడ్‌, ముత్యాల ప్రభాకర్‌ రెడ్డి, కౌన్సిలర్‌ లు బొడిగె అరుణ భాలకృష్ణ, ఎండి.బాబాషరీ్‌ఫ్‌, తాడూరి శిరిషాపరమేష్‌, ఊడుగు రమేష్‌,  పి.శ్రీనివాస్‌చారి, జక్కర్తి శేఖర్‌, జి.వెంకటేశయాదవ్‌ పాల్గొన్నారు.

సమన్వయంతో ప్రజల మద్దతు కూడగట్టాలి

 మునుగోడు ఉప ఎన్నికలలో టీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు సమన్వయంతో పని చేసి, ప్రజల మద్దతు కూడగట్టాలని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, వామపక్షాల జిల్లా కార్యదర్శులు ఎండి.జహంగీర్‌, గోద శ్రీరాములు కోరారు. చౌటుప్పల్‌ పట్టణంలో శుక్రవారం చౌటుప్పల్‌, సంస్థాన నారాయణపురం మండలాలకు చెందిన టీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ నాయకుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేయాలని వారు కోరారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన వెనరెడ్డి రాజు, ఏఎంసీ చైర్మన బొడ్డు శ్రీనివా్‌సరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు చింతల దామోదర్‌రెడ్డి, జక్కిడి జంగారెడ్డి, ఎంపీపీ గుత్తా ఉమ, జడ్పీటీసీ వి.భానుమతి, నాయకులు గిర్కటి నిరంజన, ఎం.ప్రభాకర్‌రెడ్డి, కత్తుల లక్ష్మయ్య, పల్లె శేఖర్‌రెడ్డి, జి.సైదులు, బండారు నర్సింహ, ఎం.శ్రీనివాస్‌, మాధవరెడ్డి, బి.గాలయ్య పాల్గొన్నారు. 

Read more