కల్వర్టు ఎత్తు పెంచాలి

ABN , First Publish Date - 2022-10-01T06:04:07+05:30 IST

భువనగిరి-చిట్యాల రహదారి మధ్యలో నాగిరెడ్డిపల్లిలో కల్వర్టు ఎత్తు పెంచి ప్రమాదాలను నివారించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

కల్వర్టు ఎత్తు పెంచాలి
నాగిరెడ్డిపల్లి కల్వర్టు వద్ద నిరసన తెలుపుతున్న గ్రామస్థులు

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 30: భువనగిరి-చిట్యాల రహదారి మధ్యలో నాగిరెడ్డిపల్లిలో కల్వర్టు ఎత్తు పెంచి ప్రమాదాలను నివారించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. చిన్నపాటి వర్షానికే కల్వర్టు పైనుంచి వరద ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కల్వర్టు ఎత్తును పెంచాలని గతంలో స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే స్పందించి కల్వర్టు ఎత్తు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గ్రామస్థులు గుండాల శ్రీనివా్‌సగౌడ్‌, జక్క నర్సిరెడ్డి, సాయికుమార్‌, మందడి సురేశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Read more