పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-12-12T23:27:01+05:30 IST

అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్‌)ప్రజాపంథా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్‌ చేశారు.

పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ప్రజాపంథా నాయకులు

సూర్యాపేట(కలెక్టరేట్‌), డిసెంబరు 12 : అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్‌)ప్రజాపంథా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్‌ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నానుద్దేశించి, మాట్లాడారు. జిల్లా కేంద్రం సమీపంలోని సర్వే నెంబరు 126లోని ప్రభుత్వ భూమిని పేదలకు కేటాయించాలన్నారు. పార్టీ ఆధ్వర్యంలో గతంలో పేదల కోసం పోరాడితే పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని కొందరు రియల్టర్లు ఆక్రమించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే వరకూ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌కు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్‌ కొత్తపల్లి శివకుమార్‌, నాయకులు కొత్తపల్లి రేణుక, మట్టిపల్లి అంజన్న, చంద్రకళ, సింహాద్రి, రామోజీ, జంగాల కృష్ణ, ఎర్ర అఖిల్‌కుమార్‌, జీవన, వెంకన్న, దుర్గన్న, సంతోషిమాతా, రమేష్‌, ఎల్లయ్య, వీరబాబు, పద్మ, బాజి, రేణుక, గౌరమ్మ, లక్ష్మి, జయమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:27:04+05:30 IST