గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-03-04T06:42:10+05:30 IST

గ్రామాల స మగ్రాభివృద్ధే ప్రభుత్వ ల క్ష్యమని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.

గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నల్లగొండ రూరల్‌, మార్చి 3:   గ్రామాల స మగ్రాభివృద్ధే ప్రభుత్వ ల క్ష్యమని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని కంచనప ల్లి, బుద్ధారం, అప్పాజీపే ట, రాములబండ, రంగారెడ్డినగర్‌, అన్నెపర్తి గ్రామా ల్లో గ్రామపంచాయతీ కా ర్యాలయం, సీసీరోడ్ల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.  రంగారెడ్డినగర్‌, అన్నెపర్తి పంచాయతీ కార్యాలయ భవనాలను ప్రారంభించి మా ట్లాడారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన బొర్ర సుధాకర్‌, వైస్‌ చైర్మన పిన్నపురెడ్డి మధుసూదనరెడ్డి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన అబ్బగోని రమెష్‌, పీఏసీఎస్‌ చైర్మన నాగరత్నంరాజు, నాయకులు తవిటి కృష్ణ, బకరం వెంకన్న, రాంరెడ్డి, దేప వెంకట్‌రెడ్డి, శంకర్‌, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. 


Read more