వైభవంగా ప్రారంభమైన లింగమంతుల జాతర

ABN , First Publish Date - 2022-06-07T06:48:47+05:30 IST

మండలంలోని నాగులపాటి అన్నారం గ్రామంలో సోమవారం లింగమంతులస్వామిసౌడమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. మహిళలు బోనాలతో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో సందడి కనిపించింది.

వైభవంగా  ప్రారంభమైన లింగమంతుల జాతర

పెన్‌పహాడ్‌, జూన్‌ 6: మండలంలోని నాగులపాటి అన్నారం గ్రామంలో సోమవారం లింగమంతులస్వామిసౌడమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. మహిళలు బోనాలతో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి,   సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు.  జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో సందడి కనిపించింది. అనంతరం సహఫంక్తి భోజనాలు చేశారు. పూజా కార్యక్రమల్లో నాగులపాటి అన్నారం, అన్నారం బ్రిడ్జి సర్పంచ్‌లు ధనియాకుల కోటమ్మ, రమణమ్మ పాల్గొన్నారు. Read more