మునుగోడు ఉప ఎన్నికపైనే రాష్ట్ర భవిష్యత

ABN , First Publish Date - 2022-08-16T06:32:17+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికపైనే రాష్ట్ర భవిష్యత ఆధారపడి ఉందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

మునుగోడు ఉప ఎన్నికపైనే రాష్ట్ర భవిష్యత
సమావేశంలో మాట్లాడుతున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 15: మునుగోడు ఉప ఎన్నికపైనే రాష్ట్ర భవిష్యత ఆధారపడి ఉందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలో సోమవారం జరిగిన బీజేపీ నాయకుల, కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. దేశ చరిత్రలో మునుగోడు ఉప ఎన్నిక నిలువనుందని చెప్పారు. కుటుంబపాలన అంతం కోసం, నిరంకుశ పాలన కోసం జరుగుతున్న ఈ ఎన్నికలో మునుగోడు ప్రజలదే అంతిమ విజయమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే మునుగోడులో టీఆర్‌ఎ్‌సను ఓడిస్తేనే సాధ్యమవుతుందన్నారు. తనను నమ్మిన కార్యకర్తలు, తన వెంట వస్తున్న అభిమానులకు అండగా ఉంటానన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉన్నందున కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికలో సైనికుల్లా పనిచేసి విజయవంతానికి కృషి చేయాలని కోరారు. ఈనెల 21 మునుగోడులో నిర్వహించే సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు రమణగోని శంకర్‌, మునగాల తిరుపతిరెడ్డి, గుజ్జుల సురేందర్‌రెడ్డి, ఉప్పు భద్రయ్య, పబ్బు రాజుగౌడ్‌, ఉబ్బు వెంకటయ్య, కొయ్యడ సైదులుగౌడ్‌, సందగళ్ల సతీష్‌, కాసర్ల శ్రీనివా్‌సరెడ్డి, కాంశెట్టి బాస్కర్‌, రావుల స్వామి, చింతల సాయిలు, సందగళ్ల కిరణ్‌ పాల్గొన్నారు.

Read more