సామ్రాజ్య వాదంపై పోరాటమే చెగువేరాకు నివాళి
ABN , First Publish Date - 2022-10-11T06:19:58+05:30 IST
సామ్రాజ్యవాదం పై పోరాటమే చేగువేరాకు ఘన నివాళులని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు.

రామన్నపేట, అక్టోబర్ 10: సామ్రాజ్యవాదం పై పోరాటమే చేగువేరాకు ఘన నివాళులని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. మండలంలోని మునిపంపుల, దుబ్బాక గ్రామంలో ఎస్ఎ్ఫఐ, డివైఎ్ఫఐ భగతసింగ్ యూత ఆధ్వర్యంలో చేగువేరా వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చెగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించి, సీఐఏ దళాల చేతిలో హత్యకుగురైన చేగువేరా స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎ్ఫఐ మండల అధ్యక్షుడు మేకల జలంధర్, డీవైఎ్ఫఐ జిల్లా సహాయ కార్యదర్శి గుండాల నరేష్, మేడి మధుబాబు, గంటెపాక శివకుమార్, చెరుకు నరేష్, బత్తిని సందీప్, మహేష్, నవీన, తొలుపునూరి భరత పాల్గొన్నారు.