‘ధరణి’ పోర్టల్‌లో లోపాలను సరిదిద్దాలి

ABN , First Publish Date - 2022-10-08T05:35:05+05:30 IST

రాష్ట్రంలో ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలను సవరించి రైతులకు పట్టాదారు పుస్తకాలు అందజేయాలని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ అన్నారు.

‘ధరణి’ పోర్టల్‌లో లోపాలను సరిదిద్దాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌

సూర్యాపేట సిటీ, అక్టోబరు 7: రాష్ట్రంలో ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలను సవరించి రైతులకు పట్టాదారు పుస్తకాలు అందజేయాలని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ అన్నారు. శుక్రవారం సూర్యా పేటలో నిర్వహించిన ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతాంగ ఆదాయం 2022నాటికి రెట్టింపు చేస్తానన్న మోదీ మాటలు ఆచరణకు నోచుకోలేదని అన్నారు. రైతులకు స్పష్టమైన మద్దతు ధరను ప్రకటించి, విద్యుత్‌ ధరల సవరణ బిల్లును ఉపసంహరించుకోవాల న్నారు.  నల్లగొండ జిల్లా కేంద్రంలో నవంబరు 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ అన్నారు.  కార్యక్ర మంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి, కొప్పుల రజిత, మెదరమెట్ల వెంకటేశ్వర్లు, కందాళ శంకర్‌రెడ్డి, పల్లె వెంకటరెడ్డి తదిత రులు పాల్గొన్నారు.
Read more