బీజేపీతోనే ‘మునుగోడు’ అభివృద్ధి

ABN , First Publish Date - 2022-10-03T05:56:26+05:30 IST

బీజేపీతోనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తాజా మాజీ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడులో నిర్మించిన నూతన క్యాంపు కార్యాలయం, నివాస గృహ సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.

బీజేపీతోనే ‘మునుగోడు’ అభివృద్ధి
మునుగోడులో నూతనంగా నిర్మించిన క్యాంపు కార్యాలయంలో పూజలు చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడులో క్యాంపు కార్యాలయం ప్రారంభం


మునుగోడు, అక్టోబరు 2: బీజేపీతోనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తాజా మాజీ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడులో నిర్మించిన నూతన క్యాంపు కార్యాలయం, నివాస గృహ సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. వేదపండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, లక్ష్మీ దంపతులు హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ని యోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకే నూతన భవనాన్ని నిర్మించానని తెలిపారు. ఇక్కడ ప్రతీరోజు సు మారు 1000మందికి భోజనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నామ ని చెప్పారు. నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారం కా వాలంటే టీఆర్‌ఎ్‌సను ఓడించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీనేత,మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చాడా సురే్‌షరె డ్డి, నాయకులు రవీంద్రనాయక్‌, జితేంద్ర కుమార్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, నిహారిక రెడ్డి, కుంభం శ్రీనివా్‌సరెడ్డి, వేదాంతం గోపీనాధ్‌, దర్శనం వేణుకుమార్‌ , పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మాదగోని నరేందర్‌గౌడ్‌, కుక్కల నర్సింహాగౌడ్‌, బాలరాజుగౌడ్‌, బొడిగె అశోక్‌గౌడ్‌, రమేష్‌, పెంబళ్ల జానయ్య, కంభంపాటి నర్సింహ పాల్గొన్నారు.

బీజేపీలో పలువురి చేరిక 

మర్రిగూడ: మండలంలోని అంతంపేట, ఎరగండ్లపల్లిలోని కాంగ్రెస్‌ నేతలు పలువురు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడిద్డ సమక్షంలో మునుగోడులోని ఆయన క్యాంపు కార్యాలయంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధికోసమే రాజగోపాల్‌రెడ్డి తన పదవిని త్యాగం చేశారని, అందుకోసం ఆయనకు మద్దతుగా బీజేపీలో చేరామన్నారు. కార్యక్రమంలో శ్రీరాందాస్‌ శ్రీనివాస్‌, సింగమలై, వెంకటే్‌షగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more