మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలి

ABN , First Publish Date - 2022-10-02T05:57:33+05:30 IST

మతోన్మాద శక్తుల నుంచి దేశా న్ని కాపాడుకోవాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్‌ అన్నారు.

మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలి
ఉపాధ్యాయులను సన్మానిస్తున్న సీపీఐ నాయకులు

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్‌ 

చిలుకూరు, అక్టోబరు 1: మతోన్మాద శక్తుల నుంచి దేశా న్ని కాపాడుకోవాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్‌ అన్నారు. మండలకేంద్రంలో శనివా రం జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. కార్పొరేట్‌ శక్తుల కు దేశసంపదను కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలపై అదనపు భారం పడుతోందన్నారు. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడ లో నిర్వహించే సీపీఐ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, ఉత్తమ ఉపాధ్యాయులు కె. రామారావు, మండవ ఉపేందర్‌, సురగాని లింగయ్య, రాయల శ్రీను, ఖలీల్‌లను సీపీఐ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో స్వాతం త్య్ర సమరయోధుడు దొడ్డా నారాయణరావు, సాహెబ్‌ అలీ, వెంకటయ్య, రెమిడాల రాజు, మట్టయ్య, దొడ్డా నాగేశ్వరరావు, రామారావు, పుట్టపాక అంజయ్య, వెంకటేశ్వర్లు, గంగాధర్‌, ఏడుకొండలు, కొండా వెంకయ్య, సాతులూరి అలివేలు పాల్గొన్నారు. 

Read more