హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-08-01T06:03:11+05:30 IST

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విపలమైందని వామపక్షాల నాయకులు మల్లు నాగార్జునరెడ్డి, మండారి డేవిడ్‌కుమార్‌, కొత్తపల్లి శివకుమార్‌ అన్నారు.

హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం
సూర్యాపేటలో రాస్తారోకో నిర్వహిస్తున్న వామపక్షాల నాయకులు

సూర్యాపేట అర్బన్‌, జూలై 31: రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విపలమైందని వామపక్షాల నాయకులు మల్లు నాగార్జునరెడ్డి, మండారి డేవిడ్‌కుమార్‌, కొత్తపల్లి శివకుమార్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్‌స్టేషన్‌ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిచారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ  కిసాన్‌ మోర్చా పోరాట విరమణ సందర్భంగా 2021 డిసెంబరు తొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన లిఖితపూర్వక వాగ్ధా నాలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. కనీస మద్దతు ధర ఏర్పా టులో మోసం చేసిందన్నారు. రైతులపై మోపిన తప్పుడు కేసులు ఎత్తివేయలేదని, ఆందోళన విరమించుకున్న సమయంలో విద్యుత్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం యత్నించిందన్నారు.  రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బీజేపీ ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, సైదులు, గోవింద్‌, కోట గోపి, దండ వెంకట్‌రెడ్డి, మేకనబోయిన శేఖర్‌, ఏకలక్ష్మి, నర్సింహారావు, జ్యోతి, రవి, సైదమ్మ నర్సయ్య, నజీర్‌, నాగయ్య, సైదులు, మధు, కిరణ్‌, రమేష్‌, ప్రవీణ్‌, ఏపూర్‌ సోమన్న, పాల్గొన్నారు. 

హామీలు అమలయ్యే వరకు పోరాటం: రైతు సంఘం 

కోదాడ రూరల్‌: రైతులకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, సీపీఎం పట్టణ కార్యదర్శి మిట్టగణుపుల ముత్యాలు అన్నారు. కోదాడలో జాతీయ రహదారిపై నిర్వహించిన రాస్తారో సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో కౌలుదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్‌ సైదా, రైతుసంఘం జిల్లా నాయకులు దేవరం వెంకటరెడ్డి, దాసరి శ్రీనివాస్‌, మంద వెంకటే శ్వర్లు, పాలె కృష్ణ, వెంకన్న, నర్సింహారావు, రాములు పాల్గొన్నారు.
Read more