డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా

ABN , First Publish Date - 2022-07-18T06:07:37+05:30 IST

జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి డి వైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది.

డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా
రోడ్డుకు అడ్డంగా బోల్తా పడిన కారు

ఇద్దరికి గాయాలు, రహదారిపై నిలిచిన రాకపోకలు

చిట్యాలరూరల్‌, జూలై 17: జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి డి వైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటన ఆదివారం చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారు లో జరిగింది. ఏపీ 39 డీయు 6992 నంబరు గల కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వై పునకు వెళ్తుంది. గుండ్రాపల్లి గ్రా మశివారులోని దొడ్ల డెయిరీ స మీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రహదారి మధ్యలో బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారు మరో వా హనంలో ఆస్పత్రికి వెళ్లారు. రహదారికిపై కారు బోల్తా పడటంతో వాహనదారులు న డిరోడ్డుపై తలకిందులుగా పడిన కారును తొలగించారు. కారు రోడ్డుపై అడ్డంగా పడ టంతో విజయవాడ వైపునకు వెళ్లే వాహనాల రాకపోకలు కొద్దిసేపు నిలిచిపోయాయి. కారును పక్కకు తొలగించాక వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి. ఘటన పై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సైదాబాబు తెలిపారు.


Read more