మునుగోడుకు ఉప ఎన్నికను తెచ్చిన బీజేపీని ఓడించాలి

ABN , First Publish Date - 2022-10-02T05:54:01+05:30 IST

ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేందుకే మునుగోడు ఉప ఎన్నికను తెచ్చిన బీజేపీని ఓడించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు.

మునుగోడుకు ఉప ఎన్నికను తెచ్చిన బీజేపీని ఓడించాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీతారాములు


  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సీతారాములు 

భువనగిరి టౌన, అక్టోబరు 1: ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేందుకే మునుగోడు ఉప ఎన్నికను తెచ్చిన బీజేపీని ఓడించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. శనివారం భువనగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, స్వలాభం కోసం పార్టీ మారిన తీరును మునుగోడు ఓటర్లు గమనిస్తున్నారన్నారు. కులం, మతం పేరిట బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి దూరంగా ఉంటూ, మ్యానిఫెస్టోను అమలు చేయలేని రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు. బీజేపీని ఓడించేందుకే  టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, నాయకులు కొండమడుగు నర్సింహ,  బి.అనురాధ, మంగ నర్సింహులు, మాటూరి బాల్‌రాజ్‌, కల్లూరి మల్లేశం, దోనూరి నర్సిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, దయ్యాల నర్సింహ, పాషా పాల్గొన్నారు. 

Read more