బీజేపీ అసమర్థ ఆర్థిక విధానాలపై పోరాడాలి

ABN , First Publish Date - 2022-04-24T06:06:41+05:30 IST

బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర విధానాలతో దేశ ప్రజల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు.

బీజేపీ అసమర్థ ఆర్థిక విధానాలపై పోరాడాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు సీతారాములుసీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు
రామన్నపేట, ఏప్రిల్‌ 23:
బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర విధానాలతో దేశ ప్రజల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. స్థానిక సీపీఎం మండల కార్యాలయంలో మేక అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌ దేశాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా తీసుకెళుతోందన్నారు. నిత్యం పెరుగుతున్న నిత్యావసర ధరలతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోందన్నారు. శ్రమకు తగ్గ కూలి దక్కపోవడంతో పెరుగుతున్న ధరలతో సామాన్యుల జీవనం దుర్భరంగా మారుతోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ ప్రజల ఆస్తులను మాయం చేస్తోందన్నారు. రాషా్ట్రల హక్కులను కాలరాస్తూ బీజేపీ పాలిత రాషా్ట్రలకు మాత్రమే నిధులు కేటాయించడం అప్రజాస్వామికమన్నారు. అధికారంలోకి రాకముందు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గిస్తామని చెప్పి, చరిత్రలో లేని విధంగా తారాస్థాయిలో పెంచిందన్నారు. కరోనా మూలంగా కార్మికులు, పేదల కుటుంబాల జీవనం అస్తవ్యస్తమైతే దాన్ని పట్టించుకోకుండా మతాల పేరుతో ప్రజల్లో ప్రణాళిక ప్రకారం వైషమ్యాలు సృష్టిస్తోందన్నారు. బీజేపీ దేశానికి ప్రమాదమని ప్రజలు చైతన్యమై కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటిత పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సిం హ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దోనూరి నర్సిరెడ్డి, మంగ నర్సింహులు, దాసరి పాండు, రొడ్డ అంజయ్య, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, బూర్గు కృష్ణారెడ్డి, వనం ఉపేందర్‌, సిర్పంగి స్వామి, గడ్డం వెంకటేశం, ఎండి.పాష, శ్రీనివాసచారి, బాలగోని జయరాములు, మాయ కృష్ణ, ఇక్బాల్‌, మద్దెపురం రాజు పాల్గొన్నారు.

Read more