తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదు

ABN , First Publish Date - 2022-06-11T06:36:21+05:30 IST

తెలంగాణలో బీజేపీ నాయకులు అవలంభిస్తున్న విధానాలు ప్రజలకు విరక్తి కలిగిస్తున్నాయని ఆ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు.

తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదు
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ సునీతామహేందర్‌రెడ్డి

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి 

తుర్కపల్లి, జూన 10: తెలంగాణలో బీజేపీ నాయకులు అవలంభిస్తున్న విధానాలు ప్రజలకు విరక్తి కలిగిస్తున్నాయని ఆ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల మనోభావాలు దెబ్బకొట్టాలని, మత యుద్ధాలు సృస్టించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, తెలంగాణ ప్రాంత ప్రజలు చైతన్య వంతులు కాబట్టే ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి ముందుకు పోతున్నారన్నారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రబుత్వం నిధులు ఇవ్వడం లేదని బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.  బీజేపీ వాళ్లకు ఉన్న లక్ష్యం ఒక్కటేనని, తెలంగాణను విచ్ఛిన్నం చేయడం, మతవిద్వేషాలు రెచ్చగొట్టడం అన్నారు. రాష్ట్రంలో అస్థిరతను తీసుకువచ్చి, మిలిటరీని దించి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి రాష్ట్రంలో అధికారం చెలాయించడానికి, గవర్నర్‌ పాలన పెట్టే దుర్బుద్ధి, కుట్రలు కనిపిస్తున్నాయన్నారు. గవర్నర్‌ చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని, ప్రజల మనోభావాలను అవమానించే విధంగా ఉన్నాయని అన్నారు.  రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని  కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోగా అనేక ఇబ్బందులు పెడుతోందన్నారు.  బీజేపీ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.   సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్‌నాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన సింగిరెడ్డి నర్సింహారెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు కొమిరిశెట్టి నర్సింహులు, మాజీ ఎంపీపీ బోరెడ్డి రాంరెడి పాల్గొన్నారు. 

Read more